కరెంట్ వైర్ల దొంగల ఆరెస్టు

0 9,256

యాదాద్రి భువనగిరి ముచ్చట్లు:

 

రియల్ ఎస్టేట్ వెంచర్లలో కరెంటు వైర్లు దొంగతనం చేస్తున్న జనగామ జిల్లాకు చెందిన ఐదుగురిని బీబీ నగర్ మండలం గూడూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై  యాదగిరి గుట్ట, భువనగిరి రూరల్, భువనగిరి పట్టణం, బొమ్మల రామరం, బిబినగర్ మండలాల్లో 7 కేసులు నమోదు అయ్యాయని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. చోరీ చేసిన సొత్తు ను నిందితులు హైదరాబాద్ లో అమ్ముకొని సొమ్ము  చేసుకుంటున్నారు. ఐటి సెల్ రాచకొండ పోలీసుల ,  సిసి ఎస్ భువనగిరి సహాయం తో నిందితులను బిబినగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. నిందితుల నుంచి రూ. 8, 25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. టాటా ఎస్, అశోక్ లీ ల్యాండ్ వాహనాలు, రెండు ద్వి చక్ర వాహనాలు, 5 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వెంచర్ల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని డిసిపి నారాయణ రెడ్డి వెంచర్ దారులకు సూచించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Arrest of thieves of current wires

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page