బీసీల పక్షపాతి సీఎం జగన్ – శోభ

0 9,710

పుంగనూరు ముచ్చట్లు:

 

బీసీల పక్షపాతిగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ శోభ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం బిల్లు ప్రవేశపెట్టినందుకు బీసీలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మండలంలోని పంచాయతీ కేంద్రమైన ఆరడిగుంట సచివాలయంలో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల చిత్రపటాలకు క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన కులాల అభివృద్ధికి బంగారు బాటలు వేయడంతో బీసీల ఆత్మ గౌరవాన్ని కాపాడిన ప్రభుత్వానికి ఎప్పుడూ అండగా ఉండాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం బీసీలపై కపట ప్రేమను చూపిస్తూ బీసీల అభివృద్ధి మాటలకే పరితమైందని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. అంతేకాకుండా బీసీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని బీసీ కార్పొరేషన్ ద్వారా పదవులు అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందన్నారు. అలాంటి ప్రభుత్వానికి వెనుకబడిన కులాలు ఎప్పటికి మద్దతుగా ఉండాలని ఆమె కోరారు. జిల్లాలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్ రావు, విఆర్వో రవి నాయక్, సర్పంచ్ శంకరప్ప, ఎంపీటీసీ నంజుండప్ప, నాయకులు రెడ్డెప్ప, రెడ్డెప్పరెడ్డి, చంద్ర, నాగరాజ, జగదీష్, వినోద్, సంఘమిత్ర తదితర మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: BCs biased CM Jagan – Shobha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page