డిసెంబ‌రు 5న అన్న‌మాచార్య క‌ళామందిరంలో భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు

0 3

తిరుప‌తి ముచ్చట్లు:

 

టిటిడి హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వర్యంలో డిసెంబరు 5వ తేదీన తిరుప‌తి అన్న‌మాచార్య క‌ళామందిరంలో ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలు నిర్వ‌హించ‌నున్నారు. టిటిడి విద్యాసంస్థ‌ల‌తో పాటు తిరుప‌తిలో స్థానికంగా చ‌దువుతున్న విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్న‌వ‌చ్చు.ఇందులో భాగంగా భ‌గ‌వ‌ద్గీత 17వ అధ్యాయం (శ్ర‌ద్ధాత్ర‌య విభాగ యోగం)లో 6, 7వ త‌ర‌గ‌తి విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగాను, 8, 9వ త‌ర‌గ‌తుల విద్యార్థినీ విద్యార్థులు మరొక విభాగంగాను పోటీలు నిర్వ‌హించ‌నున్నారు.అలాగే, భ‌గ‌వ‌ద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలు కంఠ‌స్థం వ‌చ్చిన 18 సంవ‌త్స‌రాల లోపు వారికి జూనియ‌ర్స్‌గాను, అంత‌కుపైబ‌డిన వారికి సీనియ‌ర్స్ విభాగంగాను పోటీలు నిర్వ‌హిస్తారు. ఆస‌క్తిగ‌ల‌వారు డిసెంబ‌రు 5న ఉద‌యం 9 గంట‌ల‌కు అన్న‌మాచార్య క‌ళామందిరంకు రావ‌లసి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు 9676615643, 9866028992, 9133681593 నంబ‌రుకు సంప్ర‌దించాల్సి ఉంటుంది.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి గీతాజయంతి సందర్భంగా డిసెంబ‌రు 14వ తేదీన బహుమతులు ప్రదానం చేస్తారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Bhagavad Gita memorization competitions on December 5 at Annamacharya Art Gallery

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page