రికార్డు సమయంలో ట్రాక్‌ పునరుద్ధరణ-నెల్లూరు-పడుగుపాడు లైన్‌ క్లియర్

0 3

నెల్లూరు  ముచ్చట్లు:

భారీ వర్షాలతో నెల్లూరు- పడుగుపాడు సెక్షన్ల వద్ద  కోతకు గురై తీవ్రంగా దెబ్బతిన్న,  రైల్వే  ట్రాక్‌ను అధికారులు రికార్డు సమయంలో పునరుద్ధరించారు.  భారీ వర్షాలతో పడుగుపాడు-నెల్లూరు మెయిన్‌ లైన్ మధ్య 1.8 కి.మీ పొడవున ట్రాక్‌ దెబ్బతింది.  దీంతో విజయవాడ- చెన్నై గ్రాండ్‌ ట్రంక్‌ మార్గంలో  విజయవాడ-చెన్నై, చెన్నై-విజయవాడ  2  మెయిన్‌ లైన్‌లు తీవ్రంగా దెబ్బతిని రైళ్ల రాకపోకలు  పూర్తిగా నిలిచిపోయాయి.  యుద్ధ ప్రాతిపదికన  పనులు చేపట్టిన విజయవాడ డివిజన్‌ అధికారులు కేవలం 40 గంటల్లోనే  ట్రాక్‌ పునరుద్ధరణ పనులు విజయవంతంగా పూర్తి చేశారు. విజయవాడ డివిజినల్‌  మేనేజర్‌ శివేంద్ర మోహన్‌, అధికారుల బృందం ఖచ్చితమైన ప్రణాళిక, అందుబాటులో ఉన్న వనరుల సమీకరణతో పునరుద్ధరణ పనులు  పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. 300 మంది కార్మికులు, 50 మంది సూపర్‌ వైజర్లు, 25 మంది అధికారులు, సిబ్బంది 24 గంటల పాటు 2 షిఫ్టుల్లో అవిశ్రాంతంగా పనిచేసి, ట్రాక్‌ పూర్తిగా సాధారణ స్థితికి తీసుకొచ్చినట్టు అధికారులు వెల్లడించారు.  రికార్డు సమయంలో ట్రాక్‌ను పునరుద్ధరించిన విజయవాడ డివిజన్‌ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా అభినందించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Clear track restoration-Nellore-Padugupadu line in record time

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page