ప్రజాసేవలో  ప్రాథమిక వైద్యులు ఉండటం హర్షణీయం

0 9,259

నారాయణ హాస్పిటల్ ఏజీఎం సిహెచ్.భాస్కర్ రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

 

- Advertisement -

నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని బుజ బుజ నెల్లూరులోని జిల్లా పీఎంపీ అసోసియేషన్ కార్యాలయంలో 25,29 డివిజన్ కార్పొరేటర్లుగా ఎన్నికైన షేక్ సత్తార్, బద్దెపూడి నరసింహగిరి లకు జరిగిన ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పీఎంపీ వైద్యులు సామాజిక సేవలో  ముఖ్యభూమిక పోషిస్తున్నారని, గ్రామాలలో వారి ప్రాథమిక వైద్యసేవలకు వెలకట్టలేమని అన్నారు. షేక్ సత్తార్ 2 సార్లు కార్పోరేటర్ గా ఎన్నిక కావటం చాలాగొప్ప విషయమని ఆయన కొనియాడారు. పీఎంపీ వైద్యుడుగా, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, కార్పోరేటర్ గా అతను అందిస్తున్న సేవలు  ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని, అందుకే అతన్ని గెలిపిస్తున్నారని అన్నారు. ఈ సందర్భముగా వారికి శాలువాలు కప్పి, పూల మాలలు, బొకేలు ఇచ్చి ఘనంగా సన్మానించారు.
సన్మాన గ్రహీతలు సత్తార్, నరసింహగిరి మాట్లాడుతూ డివిజన్ లోని ప్రతిఒక్కరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందేలా చూస్తామని, ఈరోజు పీఎంపీ అసోసియేషన్ ఏర్పాటుచేసిన అభినందన ఆత్మీయ సన్మానం చాలా సంతోషం కలిగించినదని, ఈ సన్మానంతో మా బాధ్యత మరింత పెరిగినదని తెలిపారు.ఈ కార్యక్రమములో ఏపీయుడబ్యుజె రాష్ట్ర కార్యదర్శి ఎ.జయప్రకాష్, అడ్వకేట్ పి.రమాదేవి, రూడ్స్ అధ్యక్షులు షేక్ రసూల్, పీఎంపీ జిల్లా అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్, నాయకులు జి.శేషయ్య, డి. శ్రీనివాసులు, యన్.ప్రసాద్, సి.వీరయ్య, పీఎంపీ సభ్యులు పాల్గొన్నారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: It is gratifying to have primary care physicians in the public service

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page