మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

0 9,262

సిద్దిపేట ముచ్చట్లు:

 

సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం   కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ రెండవ డోస్ వేసుకున్నారా.. అంటూ ఆరా తీశారు. తప్పనిసరి వేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేయాలని కోరారు. ఏంపీటీసీ బాల్ రెడ్డి సొంత నిధులతో చేపడుతున్న అభివృద్ధి అభినందనీయమైనవని, గ్రామంపై బాల్ రెడ్డికి ఉన్న మమకారం ప్రేమ వెలకట్టలేనిదని మంత్రి కొనియాడారు. అనంతరం  జగదేవ్ పూర్ మండలం తీగుల్ నర్సాపూర్ గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండ పోచమ్మ ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు  హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ సమీపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి హాజరయ్యారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Minister Harish Rao inaugurated the mineral water plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page