భారీ వర్షాలను ఎదుర్కొనడానికి పోలీస్ యంత్రాంగం అప్రమత్తం

0 9,269

తిరుపతి ముచ్చట్లు:

 

రానున్న రోజుల్లో అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పాడనున్న నేపధ్యంలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఫ్  బృందాలను అప్రమత్తంచేసి అత్యవసరం వచ్చినప్పడు ఎదుర్కోవలసిన పరిస్థితులపై సూచనలు, సలహాలను అర్బన్ జిల్లా యస్.పి  వెంకట అప్పల నాయుడు, చేసారు. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు అతి భారీగా వర్షాలు పడనున్నాయని అని సమాచారం. భారీ వర్షాలు రానున్న నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితేనే ప్రజలు గానీ, వాహనదారులుగానీ బయటకు రావాలి. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ పోల్స్,  చెట్ల కింద నిలబడరాదు. పాత భవనాల కింద, చెట్ల కింద, విధ్యుత్ స్థంబాలు ఉన్న ప్రాంతాలలో ప్రజలు ఉండరాదు. ఈ సమయంలో ప్రస్తుతం నిండిన చెరువులు పొంగే అవకాశం ఉంది. నదులు, కాలువలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించ వచ్చు. పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలలో భయాందోళనలు కలిగించకండి. అపోహాలను నమ్మొద్దు. ఏ విషయమైనా నిర్ధారణ చేసుకోండి. సోషల్ మీడియా, వాట్సప్ లలో  కొన్ని వార్తలను అతిగా నమ్మకండి. మెసేజులు వచ్చిన వెంటనే ఇతరులకు పంపకండి, ఒక్కసారి నిజమెంతో తెలుసుకోండి.ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి, అలసత్వం పనికిరాదు.అనుక్షణం మీ రక్షణ కొరకే మేమున్నామని అయన అన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Police were alerted to deal with the heavy rains

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page