ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో అందరికీ గుర్తింపు

0 9,666

కౌతాళం ముచ్చట్లు:

 

గురువారం కౌతాళం మండలం కేంద్రం ఎంపీడీవో ఆఫీస్ నందు ఎంపీపీ ఎస్. అమరేష్, వైస్ ఎంపీపీ బుజ్జి సామి మరియు కో ఆప్షన్ మెంబర్ బి. మాబు సాహెబ్ గారు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. వీరు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీల జనగణన నిర్వహించాలని బిల్ పాస్ చేయడం జరిగింది అందుకు గాను మన ప్రియతమ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్  రెడ్డి , మన మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వై.బాలనాగిరెడ్డి కు  కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని బీసీల జనగణన జరిగితే మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయనని పేర్కొన్నారు  వారు మాట్లాడుతూ ఒకప్పుడు మహనీయుడు ఎన్టీ రామారావు గారు బీసీలకు సముచిత స్థానం కల్పించి రాజకీయంగా గుర్తించడం జరిగిందని కాని ఇన్ని రోజులకు మన సీఎం గారు బీసీలను గుర్తించి ఉన్నత పదవులను కట్టబెట్టడం అయితేనేమి బీసీల జనగణన బిల్ పాసు చేయించడం జరిగిందని సీఎం  జగన్మోహన్ రెడ్డి  మాట ఇచ్చినట్టే రాజకీయ పదవులలోను బీసీ ఎస్సీ ఎస్టీ లకు 50% రిజర్వేషన్ కల్పించడం జరిగిందని అలాగే మహిళలకు కూడా 50% రిజర్వేషన్ కల్పించి సముచిత స్థానం కల్పించడం జరిగిందని, గత ప్రభుత్వాలన్నీ బీసీలను వాడుకుని బీసీల ఓట్లతో గెలిచిన వారిని పల్లకి మోయడానికి పరిమితం చేయడం జరిగిందని కావున బీసీలను గుర్తించి పదవులను కట్టబెట్టి  ఇప్పుడు బీసీల జనగణన బిల్ పాస్ చేయించిన ముఖ్యమంత్రి కి  సదా రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నాగరాజ్ గౌడ్, రామనగౌడ్ కౌతాళం మేజర్ ఉప సర్పంచ్  తిక్కయ్య, కుంటనహల్  బసవన్న గౌడ్, మౌలా సాబ్ ,కౌతాళం జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్ వడ్డె రాముడు, తోవి నరసప్ప ఎరిగేరి ధర్మన్న, ఉప్పరహల్ నబిసాబ్ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Recognition for all in the government of Chief Minister Jaganmohan Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page