విశ్రాంత ప్రధానోపాధ్యాయులు నర్సింహా మూర్తి నానీలు కవితకు బహుమతి

0 9,258

నెల్లూరు  ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా  బుచ్చి రెడ్డీ పాలెంకు చెందిన  గణిత మేధావి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కవి అయిన టి.నర్సింహా మూర్తి రచించిన  నానీలు అనే కవితకు ఉత్తమ బహుమతి లభించింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణా సాహిత్య అకాడమీ వారి సౌజన్యంతో భానుపురి సాహితీవేదిక సూర్యాపేట వారి ఆధ్వర్యంలో సక్కనితొవ్వ పుస్తకావిష్కరణ మరియు భానుపురి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్ లో జరిగింది. ఈసందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో వివిధ సాహిత్య విభాగాలలో నిర్వహించబడిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు   జస్టిస్ చంద్రయ్య ఛేర్మెన్ తెలంగాణ మానవహక్కుల  కమిషన్  ఛైర్మెన్ జస్టిస్ చంద్రయ్య  చేతులమీదుగా
బహుమతులు ప్రధానం చేశారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంకు చెందిన కవి తిప్పా వఝల నరసింహమూర్తి కి నానీలు విభాగం లో ప్రోత్సాహక బహుమతి లభించింది. భారీవర్షాలకారణంగా సభకు హాజరు కాలేని వీరికి తపాలా  ద్వారా బహుమతులు అంద చేస్తున్నట్లు  భానుపురి సాహితీ వేదిక ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్ తెలియజేశారు.గతంలో నర్సింహా మూర్తి రాపూరు పట్టణంలోని శ్రీ సి వి కె. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఉన్నత పాఠశాల విభాగంలో గణిత ఉపాధ్యాయులుగా, ప్రధానోపాధ్యాయులు గాను దీర్ఘ కాలిక పనిచేశారు. ఉత్తమ హెచ్.ఎం. గా రాపూరు ప్రాంతవాసులు సుపరిచితులు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Retired Principals Narsingh Murthy Nanny Award for Poetry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page