వరంగల్ లో  గులాబీకి షాక్

0 9,674

వరంగల్ ముచ్చట్లు:

 


నుమకొండ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా సూచనలు కనిపిస్తున్నాయి. శాయంపేట మండలంలోని టీఆర్ఎస్ సర్పంచులు పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయడానికి సిద్ధమైనట్లు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అబ్బు ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వైఖరికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు.ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. శాయంపేట మండలంలో 24 గ్రామ పంచాయతీలుండగా.. 23 మంది టీఆర్ఎస్ సర్పంచులు ఉన్నారు. వీరిలో 21 మందిమి ఆదివారం పెద్దకోడెపాకలో సమావేశమయ్యాం. కొంతకాలంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దంపతులు వైఖరి సక్రమంగా లేదు. ఏదైనా పనుల కోసం వెళ్తే స్పందించడం లేదు. గ్రామాల్లో సమావేశాలు, కార్యక్రమాలకు మాకు ఆహ్వానాలు అందడం లేదు. ఎంపీపీ ఎలా చెబితే ఎమ్మెల్యే అలా వింటున్నారు. గ్రామాల అభివృద్ధిని అసలు పట్టించుకోవడం లేదు. 15 రోజుల్లో ఎమ్మెల్యే వైఖరిలో మార్పు రాకపోతే పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేస్తాం’ అని ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Shock to the rose in Warangal

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page