స్వచ్ఛంద సేవలకే మిక్కిలి ప్రాధాన్యత- ఇంచార్జి నరసింహులు

0 9,283

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రజలకు అవసరమైయ్యే స్వచ్ఛంద సేవలకే దాన్ ఫౌండేషన్ మిక్కిలి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పుంగనూరు ఇంఛార్జి నరసింహులు అన్నారు. గురువారం మండలంలోని ముడిపాపనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అడవినాథునిగుంటలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు ప్రజలు అంటురోగాలకు గురికాకుండా ముందస్తుగా చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రజలందరూ కాచి చల్లార్చిన నీళ్లే తాగాలన్నారు. ముఖ్యంగా ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అంటురోగాలు దరి చేరవని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం సుమారు 70మందికి వివిధ రకాల వైద్య చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటరామయ్య, హేమలత, గంగోజి, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Volunteer services are of utmost importance – Narasimha in charge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page