న‌వంబ‌రు 29న శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌

0 9,260

– ఉద‌యం ల‌క్షకుంకుమార్చ‌న‌

– భక్తులు వర్చువల్ గా పాల్గొనే అవకాశం

 

- Advertisement -

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 30 నుండి  డిసెంబ‌రు 8వ తేదీ వరకు ఏకాంతంగా జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 29వ తేదీ అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఉద‌యం 8 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు  ల‌క్ష‌కుంకుమార్చ‌న నిర్వ‌హిస్తారు. భక్తులు వర్చువల్ గా ఈ సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంట‌ల న‌డుమ పుణ్యా‌హ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, సేనాధిప‌తి ఉత్స‌వం, యాగ‌శాల‌లో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

 

న‌వంబ‌రు 30న ధ్వ‌జారోహ‌ణం :

ఆలయంలో న‌వంబ‌రు 30న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.45 నుండి 10 గంటల నడుమ ధ‌నుర్ల‌గ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారు వాహ‌న‌మండ‌పంలో వివిధ వాహ‌న‌ల‌పై దర్శనమిస్తారు.

 

వాహనసేవల వివరాలు :

 

తేదీ             ఉదయం           రాత్రి

 

30-11-2021 ధ్వజారోహణం    చిన్నశేషవాహనం

01-12-2021 పెద్దశేషవాహనం  హంసవాహనం

02-12-2021 ముత్యపుపందిరి వాహనం  సింహవాహనం

03-12-2021  కల్పవృక్ష వాహనం   హనుమంతవాహనం

04-12-2021   పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం, గజవాహనం

05-12-2021   స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం స్వర్ణరథం బ‌దులు సర్వభూపాలవాహనం, రాత్రి -గరుడవాహనం

06-12-2021   సూర్యప్రభ వాహనం   చంద్రప్రభ వాహనం

07-12-2021   రథోత్సవం బ‌దులు స‌ర్వ‌భూపాల వాహ‌నం – అశ్వ వాహనం

08-12-2021   పంచమితీర్థం(వాహ‌న‌మండ‌పంలో)  – ధ్వజావరోహణం.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Inauguration of Sri Padmavati Ammavari Brahmotsavala on 29th November

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page