టమాటాతో  కోటీశ్వరుడు

0 9,689

కర్నూలు ముచ్చట్లు:

 

పెట్రోల్ వంద దాటింది.. దాని వెన్నంటే డీజిల్ కూడా పరుగులు పెడుతోంది. గ్యాస్.. గుదిబండగా మారింది. ఇప్పుడు టమోటా కూడా.. మాడు పగలకొడుతోంది. 50… 60 కాదు 100 అయింది. 130 తాకింది. ఇంకా పైపైకే రేటు వెళ్తుందని అంటున్నారు. ఒక్క మదనపల్లే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఏ మార్కెట్‌కు వెళ్లినా ఇదే సీన్. ముట్టుకుంటేనే టమాట.. మంట పుట్టిస్తోంది. చెన్నైలో 140 రూపాయలు పెట్టినా టమాటా లేదు. నవంబర్ మొదటి వారంలో 20 నుంచి 30 రూపాయల మధ్య ఉన్న రేటు.. కేవలం 20 రోజుల్లోనే సెంచరీ కొట్టింది. భారీ వర్షాలు, తుపానులతో దేశంలోని చాలా ప్రాంతాల్లో పంట డ్యామేజ్ అయింది. దిగుబడి మీద ఫుల్ ఎఫెక్ట్ పడింది. పొలంలో పంట ఉన్నా కోసే పరిస్థితులు లేకపోవడం.. వర్షం నీటితో ఇబ్బందులు రావడంతో మార్కెట్‌లోకి పంట రావడం లేదు. వర్షం దెబ్బకు పంట నాణ్యత కూడా తగ్గింది.ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో  కర్నూలు జిల్లాలో  టమోటా రైతుకు కోటి రూపాయల మేర దిగుబడి వచ్చింది. కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీ కుటుంబానికి టమాట రూపంలో కాసుల పంట ఇంటికి వచ్చింది. మహమ్మద్ రఫీ , సైబా, ఉషాలాం లది ఉమ్మడి కుటుంబం. తమకు ఉన్న వంద ఎకరాల పొలంలో 40 ఎకరాల్లో వారు టమోటా పంట సాగు చేశారు. ప్రస్తుతం కిలో రూ.100 దాటిన నేపథ్యంలో వారికి అదిరిపోయే లాభం వచ్చింది. ఇప్పటివరకు 80 లక్షలకుపైగా రాబడి వచ్చింది. రానున్న రోజుల్లో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని సదరు రైతు చెబుతున్నాడు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Millionaire with Tomato

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page