సంఘాల పురోగతికి పుస్తకాల నిర్వహణ కీలకం

0 9,973

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోగతికి పుస్తకాల నిర్వహణ కీలకమని వైఎస్సార్‌ క్రాంతి పథకం ఏరియా కోఆర్డినేటర్‌ వాణిశ్రీ తెలిపారు. శనివారం స్థానిక శక్తి కార్యాలయంలో గ్రామసమాఖ్య లీడర్లు పుస్తకాల నిర్వహణపై అవ గాహన సదస్సు జరిగింది. సంఘాల ఏర్పాటు, పొదుపు నగదు సమకూర్చడం, వడ్డీ , అప్పు కంతుల కేటాయింపుపై శిక్షణ ఇచ్చారు. గ్రామ సమాఖ్య సంఘాలు, మండల సమాఖ్య సంస్థల మదింపు, ఆర్థిక వ నరుల ఏర్పాటుపై అవగాహన కల్పించారు.మండలంలో 1027 సంఘాలున్నాయని వీటిలో 10452 మంది సభ్యులున్నారు. 32 గ్రామసమాఖ్య సంఘాల ద్వారా ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఎదిగి మండలంలో ఆదర్శ గ్రామసమాఖ్యలుగా రాణించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపిఏం నర్వోత్తమరెడ్డి, డిఎంజీ శ్రీనివాస్‌, సీసీలు సుగుణ, నూర్‌ అహమ్మద్‌, వెంక టపతి, ఎంఎస్‌ య్ధ్యక్షురాలు మాయాదేవి, తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Bookkeeping is crucial to the progress of communities

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page