వరద ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన

0 9,868

చిత్తూరు ముచ్చట్లు:

 

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం విస్తృతంగా పర్యటిస్తోంది.ముందుగా తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం  పర్యటనలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలైన తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎమ్మార్ పల్లి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రోడ్డు, గొల్లవాని గుంట, కృష్ణా రెడ్డి నగర్, పూలవాణిగుంట, కొరమేను గుంట తదితర ప్రాంతాలను బృందలోని అధికారులు సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులు, ముంపునకు గురైన ఇళ్లను పరిశీలించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, జిల్లా పాలనాధికారి హరి నారాయణ, నగరపాలక కమిషనర్‌ గిరీష నష్ట వివరాలను ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసి కేంద్ర బృందానికి వివరించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Central team tour of flood prone areas

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page