పుంగనూరులో వరద బాధితులను పెద్దమనుసుతో ఆదుకోండి

0 9,887

పుంగనూరు ముచ్చట్లు:

 

 

కేంద్ర పరిశీలన బృందం వరదబాధితులను పెద్దమనుసుతో ఆదుకోవాలని ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి కోరారు. శనివారం పుంగనూరు మండలంలోని తిమ్మికృష్ణాపురంలో వరదముంపుకు గురైన వరి, టమోటా, వేరుశెనగ పంటలను కేంద్రబృందం సభ్యులు కునాల్‌సత్యార్తి, హోంఅడ్వజైర్‌ అబేకుమార్‌, డైరెక్టర్‌ మనోహరణ తో పాటు మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి కలసి పంటలను పరిశీలించారు. ఎంపిపి మండలంలో జరిగిన పంటల నష్టాన్ని వివరించారు. సుమారు 2500 ఎకరాలలో పంట దెబ్బతినిందని తెలిపారు. దీనిపై పరిశీలన బృందం సభ్యులు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జెడి శ్రీనివాసులు, తహశీల్ధార్‌ వెంకట్రాయులు , ఏడి లక్ష్మానాయక్‌, ఏవో సంధ్య , హెచ్‌వో లక్ష్మిప్రసన్న తో పాటు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Help the flood victims in Punganur with generosity

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page