అప్పులపై నియంత్రణ లోపించింది

0 9,664

రాజమండ్రి ముచ్చట్లు:

 

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  అన్నారు. ఏపీ అసెంబ్లీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులపై నియంత్రణ లోపించిందని అన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వ పాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. ఏపీ 6 లక్షల 22 వేల కోట్లు అప్పుల్లో ఉంది.. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం 3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం అప్పులు తగ్గించి ఆధాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని హితవు పలికారు.ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి నేనెప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదని ఉండవల్లి అన్నారు. పురందేశ్వరితో, హరికృష్ణతో పరిచయం ఉందని.. వాళ్లిద్దరు చాలా మంచివాళ్లు అని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఎవరూ చెడుగా మాట్లాడలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకోవడం డ్రామా అని తాను అనుకోనని చెప్పారు.అలాంటి మాటలు మాట్లాడేవారు మానసికంగా దెబ్బతిన్నవారని విమర్శించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని ప్రజలకు తెలుసుని అన్నారు. ఒక మంత్రి చంద్రబాబును.. ఓరేయ్, వాడు, వీడు అని సంబోధిస్తాడని.. అది అతడి తప్పు కాదని అన్నారు. అలా మాట్లాడినప్పుడు సీఎం వైఎస్ జగన్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

 

 

 

- Advertisement -

వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ పాద్ర ఉందనిని అంటే తాను నమ్మనని అన్నారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలు బాధ్యతగా పనిచేయడం లేదని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం మంచిది కాదన్నారు.   మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకొని.. మళ్లీ పెడతామని చెప్పడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బిల్లు కూడా సరిగా తయారు చేయకడం అనడం తప్పకుండా వైఫల్యమే అని అన్నారు. మూడు రాజధానుల బిల్లు తేడా వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పటం బాద్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మూడు రాజధానులు తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ప్రతిపక్షం సలహాలు తీసుకుంటే ప్రభుత్వానికి పేరు వస్తుందని అన్నారు.

 

Tags: Lack of control over debts

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page