నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి

0 9,679

– పంటల ను పరిశీలించి కేంద్ర బృందం
– నష్టాన్ని చూసి ఛలించిపోయిన అధికారులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీమ్‌ సభ్యులు అభేకుమార్‌, డైరక్టర్‌ మినిస్ట్రీ ఆఫ్‌పైనాన్స్ డిపార్మమెంట్‌ వారి కి జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తిలు విన్నవించారు. శనివారం చారాల పంచాయతీ ఓదులపేట సమీపంలో వర్షానికి దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి ఛలించిపోయారు. పంట కోతదశలో ఉండగా వరి వెహోత్తం వెహోకలకలు రావడం జరిగింది. వర్షానికి ఆ ప్రాంతం రోడ్డు కోతకు గురై రవాణాకు సైతం ఇబ్బందిగా ఉందని గుర్తించారు. మండలంలో 103.24 హెక్టారులలో పంట నష్టం జరిగిందిని అంచనావేశారు. ఉధ్యాన వన శాఖ సాగు 15 హెక్టారుల్లో పంట జరిగిందని వారికి వివరించారు. ప్రధానంగా వరి, టమోటా, బంగాళాదుంప, కాలిప్లవర్‌, చామంతి, బొప్పాయి, పంటలున్నాయి. రైతులు నీట మునిగిన పంటలను చూపారు. నీట మునగడంతో వరి పంట వెహోలకలు వచ్చాయని, వర్షం వలన నష్టపోయిన తమకు ఆదుకోవాలని విన్నవించారు. వారి వెంట మదనపల్లె సబ్‌కలెక్టర్‌ జాహ్నవి, జెడీలు దొరసాని, వెంకట్రావ్‌, ఉధ్యానవన శాఖ డిడి శ్రీనివాసులు,కోఆప్షన్‌ మెంబరు సాధిక్‌, ఎంపీటీసీ శ్రీరాములు, సర్పంచ్‌ విజియకుమారి, తహసీల్దార్‌ మాధవరాజు, ఎంపీడీఓ సుధాకర్‌, ఏఓ జ్యోతి, హెచ్‌ఓ హేమ కళ్యాణి,విఆర్వో అశోక్‌రెడ్డి తదిత రులున్నారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Support the lost farmer

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page