ఉద్యోగులు విశ్రాంత జీవితం సంతోషంగా గడుపుకోవాలి

0 9,888

పుంగనూరు ముచ్చట్లు:

 

పదవి విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రశాంతమైన జీవితం గడపాలని రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం అన్నారు. మంగళవారం సాయంత్రం మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ రామకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో చైర్మన్‌ అలీమ్‌బాషాతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ దంపతులను శాలుకప్పి సన్మానించారు. నాగభూషణం మాట్లాడుతూ ఆర్‌వో రామకృష్ణ ఎన్నో విభాగాల్లో పనిచేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించారని కొనియాడారు.మున్సిపాలిటిలో సమస్యలు పరిష్కరించేందుకు విశ్రాంత మున్సిపల్‌ ఉద్యోగులు ముందుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్ కమిషనర్‌ రసూల్‌ఖాన్‌, వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్రతో పాటు మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులు , స్నేహితులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Employees should live a relaxed life happily

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page