సిరివెన్నెల సీతారామశాస్త్రి అనకాపల్లిలో జననం..

0 9,673

అనకాపల్లి ముచ్చట్లు:

 

సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955 ,ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జననం ,1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభం.చంబోలు సీతారామశాస్త్రిగా ప్రేక్షకులకు పరిచయం.కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు.అదే సినిమా ఇంటిపేరుగా మారిపోయింది.సిరివెన్నెల సినిమాతో అవార్డులు సొంతం చేసుకున్న సీతారామశాస్త్రి.దర్శకుడు కె.విశ్వనాధ్ తో అన్ని సినిమాలకు పనిచేసిన సిరివెన్నెల.కె.విశ్వనాథ్ ఆయనను ప్రేమగా సీతారాముడు అని పిలుస్తాడు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు.రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు.2019లో పద్మశ్రీ వచ్చింది.కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11 నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్..ఈ మధ్య వెంకటేష్ నారప్ప, కొండపొలం సినిమాలో పాటలు రాశాడు.త్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రి.తెలుగు ఇండస్ట్రీలో హీరోలందరితో కలిసి పనిచేసిన సిరివెన్నెల.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sirivennela Sitaramashastri was born in Anakapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page