ఆరేళ్లలో 4611 కోట్ల దోపిడీ

0 9,865

హైదరాబాద్ ముచ్చట్లు:

 

హైదరాబాద్‌లో కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ప్రజల అత్యాశ, అమాయకత్వం కారణంగా సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో రెచ్చిపోతూనే ఉన్నారు. ఇలా ఆరేళ్లలో సైబర్ మోసాల కింద హైదరాబాదీలు ఎంత నష్టపోయారో తెలిస్తే కళ్లుబైర్లు కమ్మడం ఖాయం. రోజుకు రూ.2,13,49,092.. నెలకు రూ.64,04,72,775.. ఏడాదికి రూ.768,56,73,302.. ఆరేళ్లల్లో రూ.4611,40,39,817.. నగరంలో సైబర్ మోసగాళ్లు కొట్టేసిన మొత్తమిది. 2015–2020 మధ్య ఆరేళ్ల కాలంలో 9,101 మోసాల కేసుల్లో హైదరాబాద్‌ వాసులు కోల్పోయింది అక్షరాలా 4వేల కోట్ల 6వందల 11 కోట్ల 40 లక్షల రూపాయలు.ప్రజల్లో ఉన్న ఆశ, అమాయకత్వం, నమ్మకమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసపాలకు తెరలేపుతున్నారు. సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక అనేక కేసులు నమోదు కావట్లేదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదైనా సరైన దర్యాప్తు సాగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైబర్‌ మోసాల్లో సగానికి సగం పోలీసులకు వరకు రావడం లేదని, వచ్చినా అందులో సగం వరకు పరిష్కారం కావడం లేదని తెలుస్తోంది. సైబర్‌ మోసంలో డబ్బులు పోతే అవి తిరిగి రావడం అసాధ్యమనే చెప్పొచ్చు. అప్పుడప్పుడు హైదరాబాద్‌ పోలీసులు నిందితులను పట్టుకుని సొమ్ము రికవరీ చేస్తున్నా… ప్రజలు పోగొట్టుకుంటున్న దానితో పోలిస్తే ఆ మొత్తం చాలా తక్కువనే చెప్పాలి.ఇటీవల కాలంలో సైబర్‌నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్టం పోవడాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నారు. సైబర్ నేరాల పట్ల ఓ వైపు ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. ప్రాథమికంగా దర్యాప్తు అధికారులకు మెళకువలు నేర్పిస్తున్నారు. సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులకు సైబర్, ఎకనమిక్‌ నేరాల దర్యాప్తుపై ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్రమైన నేరాల్లో ఆదాయపుపన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; 4611 crore extortion in six years

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page