నది మధ్యలో గుడుంబా

0 9,865

ఒంగోలు ముచ్చట్లు:

 

బయట ఎక్కడ గుడుంబా బట్టీ పెట్టిన పోలీసులు పట్టుకుంటున్నారని తెలిసి కొంతమంది కేటుగాళ్లు విన్నూతంగా ఆలోచించారు. ఏకంగా పోలీసులకు తెలియకూడదని వాగు మధ్యలో పొదల మాటున నీటిపై తేలియాడే గుడుంబా బట్టీని సిద్దం చేశారు. చీరాల నడిబొడ్డున వెలుగుచూసిన ఈ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కుందేరు వాగులో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బల మధ్య నీటిలో తేలే స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి గుడుంబా తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే ఎప్పటిలాగే సమాచారం లీక్‌ కావడంతో అధికారులు దాడులు నిర్వహించారు.కుందేరు వాగు లోపలికి వెళ్ళి దాడి చేశారు. వాగు మధ్యలో ఏర్పాటు చేసుకున్న స్థావరంలో భారీగా బెల్లం ఊటను గుర్తించారు. నాటుసారా కాసేందుకు సిద్దం చేసిన నల్లబెల్లం, కరక్కాయ నిల్వలను ధ్వంసం చేశారు. నిందితులు ఏరు మధ్యలో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బల మధ్య బయటకు కనిపించని విధంగా స్థావరాన్ని తయారు చేసుకొని కొంతకాలంగా గుడుంబా కాస్తున్నట్టు సమాచారం. 4వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్కడే దాచి ఉంచిన 250 కేజిల నల్లబెల్లం, 50 కేజీల కరక్కాయలను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా స్థావరాన్ని నడుపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఎక్కడో నదులు, సముద్రాల మధ్య ఇలాంటి స్థావరాలు ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్‌ ముఠాలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం విన్నాం. కానీ వాగు మధ్యలో ఇలాంటి స్థావరాన్ని చూసి అధికారులు ఖంగుతిన్నారు. వాగు మధ్యలో తేలియాడే స్థావరాన్ని చెక్కలతో నిర్మించుకున్నారు. అక్కడే బెల్లంఊట తయారు చేస్తారు. సారాలో వినియోగించే నల్లబెల్లం, కరక్కాయలు, ఇతర సామాగ్రిని సిద్దం చేసుకున్నారు. వాగు మధ్యలో చెక్కలపై బట్టీలు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి వెరైటీగా గ్యాస్‌ పొయ్యిలను ఏర్పాటు చేసుకున్నారు.ఏరు మధ్యలోకి చేరుకోవాలంటే నడుంలోతు బురదనీటిలో నడచివెళ్ళాల్సి ఉంటుంది. ఇంత రిస్క్‌ చేసి ఎవరూ ఇక్కడికి రారనుకుని దుకాణం పెట్టేశారు. ఏరు మద్యలో బురదలో ఏపుగా పెరిగిన రెల్లుదుబ్బు చుట్టూ రక్షణ కవచంగా ఉందని భావించారు. అయితే తాడిని తన్నేవాడు ఒకడుంటే, వాడి తలను తన్నేవాడు మరొకరు ఉంటారన్నట్టుగా అధికారులు ఈ అక్రమార్కుల గుట్టు రట్టు చేయడం విశేషం.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Gudumba in the middle of the river

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page