ట్విటర్‌ కొత్త సీఈవో

0 9,270

హైదరాబాద్‌ ముచ్చట్లు:

పరాగ్‌ వార్షిక వేతనం.. $ 1 మిలియన్ , భారతదేశం కరెన్సీ ప్రకారం రూ. 7,50,81,000 /ట్విటర్‌ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టిన భారతీయుడు, ముంబయికి చెందిన పరాగ్ అగర్వాల్‌కి ఓ పక్క అభినందనలు వెల్లువెత్తుంటే.. మరో పక్క నెటిజన్లు ఆయన గురించి ఆసక్తికర విషయాలను గూగుల్‌ చేయడం మొదలుపెట్టారు. ఆయన వయసెంత, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ట్విటర్‌ సీఈవోగా బాధ్యతలు స్వీకరించాక జీతం ఎంత వస్తుందనే విషయాలను తెగ వెతుకుతున్నారు. తాజాగా యూఎస్‌ ఎస్‌ఈసీకి ఆయన సీఈవోగా నియమితులైయ్యాక పరాగ్‌కి వచ్చే వార్షిక వేతన వివరాలను వెల్లడించింది.38ఏళ్ల పరాగ్‌… 2005లో ఐఐటీ-బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ బీటెక్‌ పూర్తి చేశాక.. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్‌లో మాస్టర్స్‌, పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆపై 2011లో ట్విటర్‌ సంస్థలో చేరారు.  ఇక యూస్‌ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్‌ కమీషన్  వెల్లడించిన వివరాలు ప్రకారం… పరాగ్‌ వార్షిక వేతనం.. $ 1 మిలియన్ ( భారతదేశం కరెన్సీ ప్రకారం రూ. 7,50,81,000 / రూ. 7.50 కోట్లు) అన్నమాట. ఒక మిలియన్‌ డాలర్ల వార్షిక వేతనంతో పాటు 12.5 మిలియన్‌ డాలర్లు విలువ చేసే రెస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: New CEO of Twitter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page