సమరానికి సంసిద్దం ఉద్యోగ సంఘాల కార్యాచరణ నోటీసులు

0 9,667

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీ సీఎస్ కి ఉద్యోగుల సంఘాలు ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చాయి.  ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎస్ కి ఉద్యమ కార్యచరణ నోటీస్ ఇచ్చాం. నెలరోజులుగా ప్రభుత్వ పెద్దలతో చుట్టు తిరిగి అలసిపోయాం. మాకు ఇవ్వాల్సి పిఆర్సీ ,డీఏలు వంటి 45 డిమాండ్స్ ఇవ్వాలని వేడుకున్నాం. ప్రభుత్వ పెద్దల మాటలు మూటలుగానే  అయ్యాయే తప్పా అమలు కాలేదని అన్నారు.
మేము ప్రకటించిన కార్యాచరణ యధావిధంగా అమలు చేస్తాం. ఈ నెల 7నుండి మా ఉద్యమం ప్రారంభం అవుతుంది. ఇది కేవలం ప్రభుత్వ తప్పిదమే. పిఆర్సీ నివేదిక ఇప్పటికీ ఇవ్వలేదు. 55శాతం ఫిట్మెంట్  ఇవ్వాల్సిందే. మేము దాచుకున్న 1600కోట్లు ఇవ్వమని ఆడిగినా ఇవ్వడం లేదని అన్నారు.
ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పారాజు, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఐదు పేజీల ఉద్యమ కార్యాచరణ ను సీఎస్ కు ఇచ్చాము. నవంబర్ నెలాఖరుకు అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సజ్జలతో పాటు  మిగతా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. మూడేళ్ళుగా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించాము. కరోన కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా  ఇబ్బంది పడినప్పుడు ఉద్యోగులుగా సహకరించాము. కరోన సమయంలో మా జీతాల్లో కోత విధించిన సమయంలో కూడా సహకరించాము. కారుణ్య నియామకాల్లో ప్రభుత్వం మాట తప్పింది. ఉద్యోగుల రోడ్డు మీదకు రావడానికి పూర్తిగా ప్రభుత్వమే కారణం. పిఆర్సీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు. పీఆర్సీ నివేదికలో  ఏమైనా లొసుగులు ఉన్నాయా? అనే అనుమానం కలుగుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. జీతాల గురించి,ఉద్యోగులను కించపరిచేలా ఆయన  వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రభుత్వానికి ,ఉద్యోగుల మద్య దూరం పెంచేలా ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ర్ట వ్యాప్తంగా ఉద్యోగులను సంఘటితం కావాలి. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో  ప్రాంతీయ సభలు పెట్టబోతున్నాము. పోరాటం ద్వారా ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులు సమస్యల పై స్పందిస్తారని ఎదురు చూస్తున్నామని అన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Operational notices of job unions preparing for the fight

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page