అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ వాయిదా

0 9,662

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

దేశంలో అంతర్జాతీయ విమానాల పునఃప్రారంభంపై కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రభావం చూపింది. ఈ నెల 15న నిర్ణయించిన అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ వాయిదా పడింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ప్రపంచ దృష్టాంతాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలతో సంప్రదించి ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఈ నేపథ్యంలో షెడ్యూల్ చేసిన వాణిజ్య అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలను తిరిగి ప్రారంభించే తేదీపై తగిన నిర్ణయం తీసుకుంటాం. కొత్త షెడ్యూల్‌ తేదీని నిర్ణీత సమయంలో తెలియజేస్తాం’ అని పేర్కొంది.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Postponement of renewal of international flights

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page