నవవధువు ఆత్మహత్య

0 9,284

అనంతపురం ముచ్చట్లు:

 

నవవధువు సుజన ఆత్మహత్య చేసుకుంది. ఆమె బుక్కరాయసముద్రంలోని గ్రామ సచివాలయం-2లో పనిచేస్తోంది.  గత నెల 17న చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన నరసింహులు కుమారుడు విశ్వనాథ్తో వివాహమైంది.  పది రోజుల పాటు సెలవు పెట్టి పుటింట్లో ఉంది. తిరిగి సోమవారం విధులకు హాజరైంది.  సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన సుజన రాత్రి ఇంట్లోని స్నానాల గదిలో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది.  వారం రోజులుగా అత్త వారింటికి ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చింది.   తల్లిదండ్రులు సర్దిచెప్పి వెళ్లాలని సూచించారు.  వారిని వదిలి వెళ్లాల్సి వస్తుందన్న బెంగతో సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.   అప్పటికే మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అనంత గ్రామీణం సీఐ మురళీధర్రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; The bride committed suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page