మోదీ, మ‌న్మోహ‌న్ ల మద్య పాల‌న‌ లో పోలిక‌ల‌ను ఎంచ‌లేము

0 9,006

న్యూఢిల్లీ  ముచ్చట్లు:

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ల ప‌నితీరు, పాల‌న‌పై పౌర విమాన‌యాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వీరి పాల‌న‌లో పోలిక‌ల‌ను ఎంచ‌లేమ‌ని, ప్ర‌ధానిగా వీరిద్ద‌రి వ్య‌వ‌హార శైలి వేర్వేరుగా ఉంటుంద‌ని అన్నారు.ప్ర‌ధాని మోదీ ఫ‌లితాలు ఇచ్చే దూకుడైన నిర్ణ‌యాలు తీసుకునే నేత‌ని సింధియా కొనియాడారు. మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వంలోనూ సింధియా మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టారు. గత నాలుగు నెల‌లుగా ప్ర‌ధాని మోదీ నాయ‌క‌త్వంలో ప‌నిచేయ‌డం నాలాంటి బ్యాంకింగ్ రంగ నేప‌ధ్యం క‌లిగిన వారికి మెరుగైన అవ‌కాశంగా భావిస్తాన‌ని సింధియా చెప్పుకొచ్చారు.ఓ ఛానెల్ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ సింధియా ఈ వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఏడాది సింధియా తిరుగుబాటుతో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూలిపోయింది. సింధియాతో పాటు 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సింధియా ఈ ఏడాది జులైలో మోదీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా కొలువుతీరారు.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags: No comparison can be made in the governance between Modi and Manmohan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page