టీడీపీ నేత, మాజీ మంత్రిదేవినేని ఉమాకు పితృవియోగం

0 9,668

దేవినేని శ్రీమన్నారాయణ మృతికి చంద్రబాబు సంతాపం

 

కంచికచర్ల ముచ్చట్లు:

 

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. దేవినేని ఉమ తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ (చిన్ని) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటు రావడం కారణంగా గురువారం రాత్రి దేవినేని శ్రీమన్నారాయణ మృతి చెందారు. దేవినేని శ్రీమన్నారాయణ వయస్సు 89 సంవత్సరాలు. కంకిపాడు మండలం నేను పల్లి అనే గ్రామంలో శ్రీమన్నారాయణ జన్మించారు. ఆ తరువాత కంచికచర్లలో అయన  స్థిరపడ్డారు. దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. టీడీపీ అధినేత మాట్లాడుతూ… శ్రీమన్నారాయణ మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. గత నెల రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతు నిన్న రాత్రి మరణించారని తెలిపారు. శ్రీమన్నారాయణ ఎంతో కష్టపడి పైకొచ్చారని, పిల్లల్ని కూడా ఎంతగానో  తీర్చి దిద్దారని కొనియాడారు. శ్రీమన్నారాయణ కుమారుల్లో ఒకరు దేవినేని రమణ అని అన్నారు. రమణ మంచి డైనమిక్‌ లీడర్‌ అని తెలిపారు. విధి వక్రీకరించడంతో రమణ ఒక ట్రైన్‌ యాక్సిడెంట్‌లో చనిపోవడం ఒక దురదృష్టమని ఆవేదన చెందారు. ఆయన కోసమే ట్రైన్‌ యాక్సిడెంట్‌ జరిగిందా… అని అనిపించిందన్నారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేవినేని కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags; TDP leader, former minister Devineni Uma has been divorced

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page