గరుడ వాహనంపై లోకమాత

0 9,667

తిరుపతి ముచ్చట్లు:

 

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం రాత్రి అమ్మవారు శ్రీవారి పాదాలు ధరించి గరుడ వాహనంపై అభయమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వ‌స్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాల‌ను పంపుతున్నారని ఐతిహ్యం. గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారిని, అమ్మవారిని నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా, చాందినీగా, ఆసనంగా, వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు, పద్మావతీ సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి. జ్ఞానవైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలుమంగమ్మను దర్శించి సేవించినవారికి మోక్షసుఖం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

- Advertisement -

స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరిగింది.        వాహనసేవలో శ్రీశ్రీశ్రీ  పెద్దజీయ‌ర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్ స్వామి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో  కస్తూరిబాయి, ఏఈవో  ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగ‌మ‌స‌ల‌హాదారు  శ్రీ‌నివాసాచార్యులు, అర్చకులు  బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు  శేషగిరి,  మధుసుదన్, ఏవిఎస్వో  వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్  రాజేష్ క‌న్నా పాల్గొన్నారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Mother of the world on the Garuda vehicle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page