పుంగనూరులో మెగా వైద్యశిబిరానికి అపూర్వ స్పందన

0 9,689

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని లయన్స్ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం మెగా వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి వందల సంఖ్యలో రోగులు తరలివచ్చారు. లయన్స్క్లబ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ శివ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో అతిధులుగా పాల్గొన్నారు. కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన వైద్యబృందాలు వివిధ రకాల వ్యాదులకు సంబంధించి రోగులకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో 56 మందిని ఆపరేషన్ల నిమిత్తం ఎంపిక చేశారు. డాక్టర్‌ శివ మాట్లాడుతూ ఆపరేషన్లకు ఎంపికైన వారికి ఆరోగ్యశ్రీ క్రింద ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రతినిధులు మహేంద్రరావు, పిఎల్‌.శ్రీధర్‌, గోపాలకృష్ణ, ముత్యాలు, శ్రీరాములు, రఘునాథరెడ్డి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Unprecedented response to the mega medical camp in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page