ఉప్పాడలో బీభత్సం

0 9,671

కాకినాడ ముచ్చట్లు:

 

ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో పాటు, గోదావరి జిల్లాలకు జవాద్ తుఫాన్ గండం అని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజల్లో భయభ్రాంతులు నెలకొన్నాయి. అయితే ఏపీకి జవాద్ తూఫాన్ గండం తప్పింది. దీంతో ప్రభుత్వం, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాత్రి నుండి ఉప్పాడ తీరం వెంబడి అలలతాకిడి అధికంగా ఉంది. జవాద్ తూఫాన్ .. దీనికి తోడు అమావాస్య తోడుకావడంతో సముద్రంలోని కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఉవ్వెత్తున్న విరుచుకు పడుతున్న అలల తాకిడికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమయింది.ఉప్పాడ-కాకినాడ ప్రధాన రహదారిలో పెద్ద బ్రిడ్జి కూలెందుకు సిద్దంగా ఉంది. దీంతో వాహనాల రాకపోకలకు ప్రమాదం పొంచి ఉంది. తీవ్ర అలల తాకిడికి  పెద్ద బ్రిడ్జ్ ఒక పక్కకు ఒరిగింది. మరోవైపు బ్రిడ్జి రక్షణ గోడలకు బీటలు వారాయి.  అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే బ్రిడ్జి మీద నుంచి భారీ వాహనాలు రాకపోకలు నిలిపివేయక పోతే బ్రిడ్జి కూలిపోయో ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సముద్రం అలల తాకిడికి ఉప్పాడ మార్కేట్ సెంటర్, మాయాపట్నం, కోనపా పేట వద్ద తీరం కోతకు గురవుతుంది. సముద్రం సమీపంలోని ఇల్లు, కొబ్బరి చెట్లు సముద్రంలో కలిసిపోతున్నాయి.

 

 

- Advertisement -

విశాఖలో అల్లకల్లోలం
జొవాద్ తుఫాన్ కారణంగా విశాఖపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకు దూసుకొచ్చింది. దీంతో బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. దుర్గాలమ్మ ఆలయం వరకు 200 మీటర్లు భూమి కోతకు గురవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతోపాటు పలు చోట్ల భూమి కుంగిపోయింది. దీని ప్రభావంతో పిల్లల పార్కులోని ప్రహరీ గోడ కూలిపోయింది. బల్లలు విరిగిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆర్కే బీచ్‌లోకి పర్యాటకులను నిషేధించారు. ఎవరూ రాకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని మోహరించారు.ఈ మేరకు అధికారులు పార్కుకు వచ్చే రహదారుల్ని మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాగా..జొవాద్‌ తుఫాను నేపథ్యంలో సముద్రం ముందుకొచ్చి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు.ఒడిశాలోని పూరి తీరాన్ని తాకే అవకాశముంది. ఇది బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు ఐఎండీ పేర్కొంది. ఆ తరువాత ఉత్తర ఈశాన్య దిశగా ఒడిస్సా తీరం వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
మత్స్య కారుల పస్తులు

 

 

 

జవాద్ తుఫాను మత్స్యకారులకు కష్టాలు మిగిల్చింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చేరుకున్నాయి ఎస్ డిఆర్ఎఫ్ బృందాలు. 44మంది సిబ్బందితో తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మత్స్యకారులు సముద్రతీరంలోకి వెళ్ళడం మానేశారు. ఇటు విజయనగరం జిల్లాలో తుపాన్ ఎఫెక్ట్ తో నాలుగు రోజులు గా వేటకి వెళ్లలేదు మత్స్యకారులు. అయినా అధికారులు తమను, తమ కుటుంబాలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు.నెల్లిమర్ల నియోజకవర్గంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా ఇవ్వకపోవడంతో పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అధికారులు రోజూ వచ్చి వేటకు వెళ్ళామో లేదో అని తెప్పలు చెక్ చేస్తున్నారు తప్ప తమ బాగోగులు పట్టించుకోవడం లేదంటున్నారు జాలర్లు. మరోవైపు తుఫాను ముప్పు తప్పినా తీరప్రాంతంలో కాకినాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ బీచ్ రోడ్డు వైపు, ఉప్పాడ వెళ్లే బీచ్ రోడ్ లోనూ రాకాసి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కాకినాడ బీచ్ రోడ్డు పైకి సముద్రపు అలలు వచ్చి పడుతున్నాయి. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా వుంటే.. తుపాన్ దిశను మార్చుకుని ఒడిశా వైపుగా 5వ తేదీ మధ్యాహ్నానికి పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం వెంబడి ఈ తుఫాన్‌ పూరీకి చేరుకుంటుందని భావిస్తున్నారు. అనంతరం బలహీన పడి తీవ్ర వాయుగుండంగా ఒడిశా తీరం మీదుగా పశ్చిమ బెంగాల్‌ వైపు పయనించే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తీరంలో ఇవాళ గంటకు 110 కి.మీ గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్రకు భారీ ముప్పు తప్పినా.. మత్స్యకారుల చేపల వేటపై ఆంక్షలు కొనసాగుతున్నాయి.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Beehive in Uppada9

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page