భారీగా పెరుగుతున్న బ్యాంకుల్లో డిపాజిట్లు

0 8,591

ముంబై ముచ్చట్లు:

 

దేశంలోని కమర్షియల్ బ్యాంకుల్లో డిపాజిట్లు కేవలం 15 రోజుల్లోనే రూ. 3.3 లక్షల కోట్లు పెరిగాయి. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5 తో ముగిసిన 15 రోజుల్లో  బ్యాంకుల్లోని డిపాజిట్లు భారీగా ఎగిశాయని,  గత 24 ఏళ్లలో ఇంతలా డిపాజిట్లు పెరగడం ఇది ఐదోసారి మాత్రమేనని ప్రకటించింది. దీపావళి టైమ్‌‌‌‌లో భారీగా డిపాజిట్లు ఎప్పుడూ పెరగలేదని పేర్కొంది.  కానీ, తర్వాత 15 రోజుల్లో (నవంబర్‌‌‌‌‌‌‌‌ 19 వరకు) బ్యాంకుల్లోని డిపాజిట్లు  రూ. 2.7 లక్షల కోట్లు తగ్గాయని కూడా ఎస్‌‌‌‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకటించింది. ఐపీఓ బూమ్‌‌‌‌ కొనసాగుతుండడం వలనే విత్‌‌‌‌డ్రాయల్స్‌‌‌‌ కూడా పెరిగాయని  అంచనావేసింది. తక్కువ టైమ్‌‌‌‌లోనే ఇంతలా డిపాజిట్లు పెరగడం 1997  తర్వాత ఐదో సారి.   అంతేవేగంగా తగ్గడం 1997 తర్వాత మొదటి సారి. నోట్ల రద్దు తర్వాత అంటే 2016 , నవంబర్‌‌‌‌‌‌‌‌ 25 తో ముగిసిన 15 రోజుల్లో బ్యాంకుల డిపాజిట్లు రూ. 4.16 లక్షల కోట్లు ఎగిశాయి. అదే ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 26 తో ముగిసిన  15 రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి.  2019 మార్చి 29 తో ముగిసిన 15 రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు, 2016, ఏప్రిల్‌‌‌‌ 1 తో ముగిసిన 15 రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. ఒక్కసారిగా ఇలా డిపాజిట్లు పెరగడం, అంతే వేగంగా తగ్గడం ప్రజల పేమెంట్స్ అలవాట్లలో  మార్పులొచ్చాయనే విషయాన్ని తెలుపుతున్నాయని ఎస్‌‌‌‌బీఐ రిపోర్ట్ అంచనావేసింది.  రివర్స్‌‌‌‌ రెపో రేట్లలో (ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ దగ్గర) డిపాజిట్లు కూడా ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 19 నాటికి రూ. 0.45  లక్షల కోట్లుగా ఉండగా, నవంబర్‌‌‌‌‌‌‌‌ 19 నాటికి రూ. 2.4 లక్షల కోట్లకు పెరిగాయని ఎస్‌‌‌‌బీఐ రిపోర్ట్ పేర్కొంది.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Deposits in banks growing massively

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page