మహళ దారుణ హత్య

0 9,274

అనంతపురం ముచ్చట్లు:

 

మహిళను బండరాళ్లతో కొట్టి  దారుణంగా హత్య చేసిన సంఘటన రాయదుర్గం మండలంలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని చదం తమ్మేపల్లి రహదారి పక్కన పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైంది మొహం పై బండరాళ్లతో మోది చంపారు. మహిళ వయసు సుమారు 46 ఏళ్లు ఉండవచ్చుని తెలుస్తోంది.  ఆదివారం సాయంత్రం గుర్తించిన స్థానికులు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సిఐ సురేష్ బాబు ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Mahala brutal murder

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page