మార్చి 25న విడుదలకానున్న మాస్ మహారాజ రవితేజ, శరత్ మాండవ, సుధాకర్ చెరుకూరి ‘రామారావు ఆన్ డ్యూటీ’

0 8,220

హైదరాబాద్ ముచ్చట్లు:

మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రయూనిట్ నేడు రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మార్చి 25, 2022న ఈ సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌కానుంది. మార్చి చివరి వారం నుంచి సమ్మర్ సీజన్ మొదలవుతుంది. సమ్మర్ రేసులో రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో బరిలోకి దిగబోతోన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజ స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. రైతులు, పోలీస్ అధికారులు కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ప్ర‌ముఖ న‌టీన‌టులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా… సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని  తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్‌  జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. నటీనటులు : రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri ‘Rama Rao on Duty’ to be released on March 25

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page