తిరుపతిలోని నవజీవన్‌ ట్రస్ట్ కు జాతీయ అవార్డు

0 9,901

ఢిల్లీ ముచ్చట్లు:

 

శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో విశిష్ట సేవలు అందిస్తున్న నవజీవన్‌ ట్రస్టుకు జాతీయ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవిద్‌ అందజేశారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీధర్‌ అచార్య అవార్డును అందుకున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా దివ్యాంగులు, వృద్ధులు, నిరాశ్రయులకు వివిధ రకాల సేవలు అందిస్తున్న నవజీవన్‌ట్రస్ట్కు జాతీయ పురస్కారాన్ని ప్రకటించడంతో తమపై బాధ్యతలు మరింతగా పెరిగిందన్నారు. ఉత్తమ సామాజిక సేవలు అందిస్తున్న ట్రస్ట్కు అవార్డు రావడంపై శ్రీనివాసన్‌ తో సహా పట్టణ ప్రముఖులు, ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్‌ శ్రీధర్‌అచార్యకు , సిబ్బందికి అభినందనలు తెలిపారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Navajivan‌ Trust National Award

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page