పుంగనూరులో బాబాసాహేబ్‌ అంబేద్కర్‌కు ఘననివాళులు

0 9,699

పుంగనూరు ముచ్చట్లు:

 

భారతరాజ్యాంగ కమిటి చైర్మన్‌ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, జానపదకళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం కలసి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమి డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. వీరితో పాటు మాలమహానాడు అధ్యక్షుడు ఎన్‌ఆర్‌.అశోక్‌, రాష్ట్ర దళిత సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు శంకరప్ప , ఎస్‌డిపీఐ పార్టీ అధ్యక్షుడు అతిక్‌బాషాలు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నరసింహులు విడివిడిగా అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆశయాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, వైఎస్‌ఆర్‌సిపి పట్టణ కార్యదర్శి కొండవీటి నరేష్‌, దళిత నేతలు పెంచుపల్లి కృష్ణప్ప, మోహన్‌, కేశవ, పూలరమేష్‌, గంగాధర్‌, చలపతి, శ్రీనివాసులు, రెడ్డెప్ప, గోవర్ధన, గంగరాజు, మునిరాజ, గంగాధరం, శేఖర్‌, బాబు, మోహన్‌చంద్ర, దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Solid tributes to Babasaheb Ambedkar in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page