పుంగనూరులో జగనన్న సంపూర్ణ హక్కు స్కీమ్‌ వినియోగించుకోండి -కమిషనర్‌ కెఎల్‌,వర్మ

0 9,797

– ఓటిఎస్‌ వరం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేద ప్రజలకు సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కమిషనర్‌ కెఎల్‌ .వర్మ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన, చైర్మన్‌ అలీమ్‌బాషా, జానపద కళల సంస్థ చైర్మన్‌ నాగభూషణం, హౌసింగ్‌ డీఈఈ నరసింహాచారితో కలసి పోస్టర్లను విడుదల చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేసి, లభ్ధిదారుకు , వారి వారసులకు ఒక్కసారి చెల్లింపు పద్దతిపై ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటిలో రూ.15 వేలు చెల్లించాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు , ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులై డిసెంబర్‌ 21లోపు పేద లబ్ధిదారులను రుణవిముక్తులను చేసేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నాగేంద్ర, మేనేజర్‌ రసూల్‌ఖాన్‌, టిట్కో ఇన్‌చార్జ్ రవీన్‌కుమార్‌రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌, ఆర్‌ఐ తిరుమలరావు పాల్గొన్నారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Utilize Jagannath Absolute Rights Scheme in Punganur -Commissioner KL, Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page