దేవాదాయశాఖ మంత్రి చర్యలు తీసుకోరా?

0 8,283

– బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న

 

విజయవాడ ముచ్చట్లు:

 

- Advertisement -

హిందువుల పుణ్య క్షేత్రాలలో భక్తులు స్వతహాగా అర్చకులకు ఇచ్చే దక్షిణను కూడా వదలకుండా, హుండీ డబ్బుల కోసం పాకులాడుతూ “అర్చకులకు స్కేలు ఇస్తున్నాము, అందువలన ప్లేటు కలెక్షన్ రద్దు చేయడమైనది ”అని దిగజారి బోర్డులు పెట్టే దేవాదాయశాఖ ఆ పుణ్యక్షేత్రాల బాగోగులు చూడటం మీద, వాటిని సంరక్షించడం మీద మాత్రం దృష్టి సారించదా అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన, అతి పురాతనమైన యాగంటి పుణ్య క్షేత్రం గత కొన్ని నెలలుగా చుట్టూ ఉన్న అక్రమ మైనింగ్ మాఫియా పేలుళ్ల దాటికి బీటలుబారి దెబ్బతింటున్న విషయాన్ని భక్తులు అనేక మీడియా సంస్థల ద్వారా పదే పదే తెలియజేస్తున్నా దేవాదాయశాఖ గానీ, సంబంధిత మంత్రి వర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ అక్రమ మైనింగ్ మాఫియాను అడ్డుకుని, ఆలయ సంరక్షణకై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  కేవలం ఆలయాల్లో వచ్చే హుండీ డబ్బులు మాత్రమే మీకు మీ అధికారులకు కావాలా? భక్తుల మనోభావాలు అవసరం లేదా !  వెంటనే అక్రమ మైనింగ్ ను అడ్డుకుని, అక్రమార్కులపై కేసు పెట్టి యాగంటి ఆలయ సంరక్షణకు చర్యలు తీసుకోకపోతే దేవాదాయశాఖ కార్యాలయం ముందు ఆందోళనలు చేస్తామని బిజెపి ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తోందని అయన అన్నారు.

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Did the Minister of Revenue not take action?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page