జగన్ అన్న పెళ్లి కానుక మరిచావా

0 17

కడప  ముచ్చట్లు:

 


 ప్రభుత్వ ఆదాయ వనరుల కోసం కొత్త కొత్త పథకాలను తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నాటి వాగ్దానం అయినా పెళ్ళికానుక దుల్హన్ పథకం అటక ఎక్కించడం తగునా? అని, రాయలసీమ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తస్లిమ్
అన్నారు.రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యాలయం నందు విలేకరులతో అమె మాట్లాడుతూ,
 అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి గడచినా, దుల్హన్ పథకం పూసే లేకపోవటం మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం చేశారని ఆమెఅన్నారు.మైనారిటీలకు పెద్దపీట వేయడం అంటే ఇదేనా అని ఆమె ప్రభుత్వాన్ని  ప్రశ్నించారు.
నిన్న మొన్న తీసుకొచ్చిన ఓ టి ఎస్ పై ఉన్న పట్టుదల ఎన్నికల వాగ్దానం నాటి దుల్హన్ పథకం పెళ్లికానుక  పై ఎందుకు పెట్టారని ఆమె అడిగారు,కష్టకాలంలో ఉన్న ప్రజలపై ఓ టి ఎస్ పేరుతో 20 వేల రూపాయలు తీసుకోవడం తగదని, అర్హులైన వారందరికీ ఉచితంగా ఓ టి ఎస్ చేయాలని ఆమె అన్నారు.మైనారిటీ మంత్రిగా ఉన్న, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మైనారిటీ  హక్కులను,వాగ్దానాలను దుల్హన్ పథకం అమలులో పూర్తిగా వెనుకబడ్డారు అని ఆమె అన్నారు,
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో దుల్హన్ పథకాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి, మన రాష్ట్రంలో ఎప్పుడు అమలు చేస్తారో తెలపాలని ఆమె కోరారు.రాష్ట్రంలోనిమైనారిటీ ప్రజలను, అన్ని విధాలా ఆదుకుంటారాని ఆశతో ఎదురు చూశారని, ఈరోజు మీరు వారిని విస్మరిస్తే, వచ్చే రోజులలో వారు మిమ్మల్ని విస్తరించవచ్చు నని ఆమె తెలిపారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Jagan anna wedding gift marichava

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page