నేడు, రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవం …

0 9,015

కడప  ముచ్చట్లు:

 

కడప నగరం సమీపంలోని రిమ్స్ వద్ద వున్న రామచంద్రయ్య కాలనీలో వెలసివున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం, గురు వారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు జోగినేని రామ చంద్రయ్య, నిర్వాహకులు జోగినెని చంద్ర కుమార్ లు తెలిపారు. ఈ సందర్భంగా రామ చంద్రయ్య మాట్లాడుతూ బుధవారం ఉదయం 5 గంటల నుంచి సుబ్రవ్రతా సేవ, ధ్వజ రోహనం, నవగ్రహపూజ, పాల కవిడి, పూల కావిడి తో పాటు సాయంత్రం అమ్మవారికి, స్వామివారికి విడిది కార్యక్రమం, ఏదురుకోల్ల కార్యక్రమం వుంటుందన్నారు. గురువారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. 12గంటలకు వేలాది మందికి అన్న ప్రసాద కార్యక్రమం వుంటుందన్నారు. కావున భక్తులు స్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Today, tomorrow Subrahmanyeshwara Swamy Sashti Mahotsav …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page