నక్కలవాగు ప్రవాహంలో విద్యార్థి గల్లంతు

0 9,272

చిత్తూరు ముచ్చట్లు:

 

ఓ విద్యార్థి నీటి ప్రవాహంలో గల్లంతు అయిన సంఘటన మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా రామచంద్రాపురం  మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ స్వామి కథనం మేరకు వివరాలు.. తిరుపతి మండలం కుంట్రపాకం దళితవాడకు చెందిన కృష్ణయ్య కుమారుడు పృధ్వీరాజ్ సొరకాయలపాలెం ఉన్నత పాఠశాలలో 9 తరగతి చదువుతున్నాడు. సైకిల్పై రోజూ పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో మంగళవారం యధావిధిగా సైకిల్పై పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికొస్తుండగా మార్గమద్యలో కేకేవి పురం సమీపంలో నక్కలవాగు వంతెన దాటుతుండగా నీటి ప్రవాహంలో గల్లంతు అయ్యాడు. గమనించిన స్థానికులు కేకలు వేయడం.. నీటి ప్రవాహంలో గాలింపుచర్యలు చేపట్టారు. కమ్మపల్లి విఆర్ఓ చంద్రశేఖర్ జేసీబీ సహాయంతో కంపలను తొలగించగా సైకిలు బయట పడింది. సంఘటనా స్థలాన్ని రామచంద్రాపురం తహసీల్దారు చినవెంకటేశ్వర్లు, తిరుపతి రూరల్ తహసీల్దారు భాగ్యలక్ష్మీ, రేణిగుంట రూరల్ సీఐ అమరనాధ్రెడ్డి, ఎస్ఐ స్వామి, తిరుపతి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Student drowns in fox stream

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page