కారోనా వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది-సీఎం జగన్

0 9,863

అమరావతి ముచ్చట్లు:

 

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని సీఎం జగన్ అన్నారు.రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో సీఎం జగన్ తెలిపారు. వైరస్ నివారణ, నియంత్రణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల సహకారంతోనే అనేక వనరులు సమకూర్చకున్నామని, రైతులు, ఇళ్ల లబ్దిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు.థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయాల కారణంగా ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకుంటే చాలా వేగంగా పుంజుకునేదని జగన్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సహా అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో బ్యాంకర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలన్నారు. బ్యాంకుల సహకారంతోనే రాష్ట్ర ఆర్థిక స్థితి గట్టెక్కిందన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags:The financial situation has become worse because of Corona-CM Jagan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page