బెజవాడలో చెడ్డీ గ్యాంగ్ మకాం…

0 9,665

విజయవాడ ముచ్చట్లు:

 

చీక‌టి ప‌డితే చెడ్డీలు ధ‌రిస్తారు. చేతుల్లో మార‌ణాయుధాలు ప‌ట్టుకొని శివారు ప్రాంతాల్లో సంచరిస్తారు. అడ్డోస్తే అక్కడికక్కడే దాడులకు తెగబడి హతమారుస్తారు. అడ‌వాళ్లు క‌నిపిస్తే అఘాయిత్యాలకు పాల్పడుతారు. విన‌డానికే వ‌ణుకు పుట్టించే క‌రుడుగ‌ట్టిన చెడ్డీ గ్యాంగ్ మొన్నటి వరకూ హైదరాబాద్‌లో దడ పుట్టించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో హడలెత్తిస్తోంది. తాజాగా కృష్ణా, గుంటూరు జిల్లాలను చడ్డి గ్యాంగ్ వణికిస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే మూడు ఘటనలు నమోదుకావండంతో ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతుండగా.. ఇంతలో మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. పది రోజుల వ్యవధిలో చడ్డీ గ్యాంగ్ ఐదుచోట్ల దొంగతనాలకు పాల్పడింది. చిట్టి నగర్, గుంటుపల్లి, తాడేపల్లి, కుంచనపల్లి అపార్ట్మెంట్లు, విల్లాలలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కృష్ణా జిల్లా పోరంకి వసంత్‌నగర్‌లోని వ్యాపారి సత్యన్నారాయణ ఇంట్లో నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి చోరీ చేశారు. శివారు ప్రాంతాల అపార్ట్‌మెంట్‌లే లక్ష్యంగా చెడ్డీగ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. పోరంకి వసంత్ నగర్లో దొంగతనంపై పోలీసులు అలర్ట్ అయ్యారు. సీసీ కెమెరాలతో నమోదైన దొంగలకు సంబంధించిన ఆనవాళ్లతో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయవాడ పోలీసులు తెలిపారు.అయితే.. విజయవాడలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంటరైన చెడ్డీ గ్యాంగ్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఎటువైపు వెళ్లారు..? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఒకవేళ విజయవాడలోనే ముఠా సభ్యులు మకాం వేశారా..? అని చర్చించుకుంటున్నారు. అయితే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన పోలీస్‌ రికార్డులు చెబుతున్న దాని ప్రకారం చెడ్డి గ్యాంగ్‌లన్నీ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌లకు చెందినవిగా తెలుస్తోంది.దక్షిణ భారత దేశంపైపు ఉపాధి కోసం వచ్చినట్టు ఇళ్లలోంచి బయల్దేరే ఈ ముఠాలు.. దోపిడీలుకు పాల్పడి.. కొట్టేసిన సొమ్ముతో సొంతూళ్లో పెద్దమనుషుల్లా చెలామణి అవుతారు. ఒకచోట దొంగతనం చేస్తే మళ్లీ ఆ ప్లేస్‌లో చోరీలు చేయరు. అందుకే ఈ ముఠా సభ్యుల్ని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ప్రస్తుతం ఈ చెడ్డీ గ్యాంగ్‌ ఆచూకీ కోసం నాలుగు రాష్ట్రాల్లో వెతుకుతున్నారు. ఎటు నుంచి వచ్చారు? ఏవైపు వెళ్లారనేదానిపై ఓ బ్లూప్రింట్‌ తయారుచేశారు పోలీసులు. దాని ప్రకారం దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Chedi gang stays in Bejawada …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page