అమరవీరులకు పార్లమెంట్ శ్రద్ధాంజలి

0 9,866

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

చాపర్‌ ప్రమాద మృతులకు పార్లమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్ ఉభయసభల్లో గురువారం ప్రకటన చేశారు. హెలికాప్టర్ ప్రమాదం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి ఇన్వెస్టిగేషన్‌కు ఆదేశించినట్లుగా తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రక్షణ మంత్రి రాజ్‌నాత్‌ సింగ్ ప్రకటన చేశారు. రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సూలూరు బేస్ క్యాంప్‌ నుంచి 11 గంటల 48 నిమిషాలకు టేకాఫ్ అయింది.12 గంటల 15 నిమిషాలకు వెల్లింగ్టన్‌లో ల్యాండ్ కావాల్సింది. కానీ 12గంటల 08 నిమిషాల తర్వాత రాడార్‌ నుంచి సంకేతాలు నిలిచిపోయాయని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.. ప్రమాదంపై విచారణ ప్రారంభమైంది. కాసేపట్లో వెల్లింగ్టన్ చేరుకుంటారనగా ప్రమాదం జరిగిందన్నారు. ఎయిర్‌ మార్షల్ మన్వేంద్రసింగ్ నేతృత్వంలో ఇప్పటికే విచారణ మొదలైందని తెలిపారు రాజ్‌నాథ్‌ సింగ్.వెల్లింగ్టన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నారు. వరుణ్‌సింగ్‌ను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు.. మరో 48 గంటలు గడిస్తే తప్ప వరుణ్‌సింగ్‌ ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో విశేష సేలందించారు వరుణ్‌ సింగ్‌. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో డైరెక్టింగ్‌ స్టాఫ్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న శౌర్య చక్ర అవార్డును అందుకున్నారు. గతేడాది అక్టోబరు 12న ఆయన నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు.. వైఫల్యాన్ని సరిగ్గా గుర్తించారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Parliament pays tribute to the martyrs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page