పుంగనూరులో వైఎస్‌ఆర్‌ ఆర్టీసి కార్మిక సంఘాన్ని పటిష్టం చేయాలి- మంత్రి పెద్దిరెడ్డి

0 10,033

పుంగనూరు ముచ్చట్లు:

 

ఆర్టీసి కార్మికులందరిని ఏకతాటిపైకి తీసుకొచ్చి వైఎస్‌ఆర్‌ ఆర్టీసి కార్మిక సంఘాన్ని పటిష్టం చేయాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. గురువారం రాత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాహ వేడుకల్లో పాల్గొని వధువరులను ఆశీర్వధించారు. పట్టణ ఆర్టీసి డిపోలో నూతన కార్మిక సంఘ అధ్యక్షుడుగా ఎన్నికైన రామకృష్ణ, కరీముల్లా ను మంత్రి శాలువ కప్పి సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి, వేలాది కుటుంభాలను ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిదేనని కొనియాడారు. ప్రతి ఒక్కరి కష్టాన్ని తన కష్టంగా భావించే ముఖ్యమంత్రి రాష్ట్రనికి లభించడం అధృష్టమన్నారు. భవిష్యత్తులో కార్మిక సంఘాలను మరింత బలోపేతం చేసి, వారి సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ ఆర్టీసి జిల్లా అధ్యక్షుడు జయరామిరెడ్డి, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాతో పాటు పార్టీ నాయకులు చెంగారెడ్డి, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: YSR RTC labor union should be strengthened in Punganur- Minister Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page