.జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ ; ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

0 9,292

జమ్మూకాశ్మీర్‌ ముచ్చట్లు:

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. జమ్ముకాశ్మీర్‌లోని అవంతీపొరాలో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు వెల్లడించారు. అవంతీపొరాలోని బారాగామ్‌ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో కలిసి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈక్రమంలో గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భ్రద్రతా బలగాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.కాగా.. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని చుట్టుముట్టి.. భద్రతా బలగాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదని పోలీసులు తెలిపారు.

- Advertisement -

తిరుమ‌ల శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఘ‌నంగా అభిషేకం

Tags: .Encounter in Jammu and Kashmir; Terrorist killed .. Ongoing search operation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page