ఎస్వీయూ ఆచార్యులకు నెహ్రూ జాతీయ అక్షరాస్యతా అవార్డులు

0 9,006

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని (ఎస్వీయూ) అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ విభాగానికి చెందిన విశ్రాంత అధ్యాపకులు ఆచార్య పి. ఆదినారాయణ రెడ్డి, ఆచార్య ఎంసి రెడ్డెప్ప రెడ్డి నెహ్రూ జాతీయ అక్షరాస్యతా అవార్డు స్వీకరించారు. ఆదివారం ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు. ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ 2019 వ సంవత్సరానికి ఆదినారాయణ రెడ్డికి, 2020 సంవత్సరానికి రెడ్డెప్పరెడ్డిలకు ఈ అవార్డులను ప్రకటించింది. వయోజన విద్యా వ్యాప్తికి వారు చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇచ్చారు. వీరు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సేవలు అందించారు. తమ పదవీ కాలంలో వయోజన విద్యా వ్యాప్తికి పలు ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి విజయవంతంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి వయోజన విద్య కార్యక్రమంలో పురోగతి సాధించారు. భారతదేశంలో వయోజన విద్య అవసరం, ఆవశ్యకత గురించి పలు పుస్తకాల రాశారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని వయోజనవిద్య పై అనేక పరిశోధనా పత్రాలు సమర్పించారు. అలాగే పలువురు పరిశోధనా విద్యార్థులకు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. వయోజన విద్య వివిధ దేశాల్లో ఏ విధంగా ఉంది పరిశీలించి, పరిశోధించి భారతదేశానికి అనుగుణంగా అనేక సమర్థవంతమైన ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. ఎస్ యు వై విద్యావిభాగం విశ్రాంత ఆచార్యులు అవార్డు రావడం పట్ల విభాగాధిపతి, అధ్యాపకులు ఆచార్య సుధారాణి, ఆచార్య శ్యామ్ మోహన్ రాజు, డాక్టర్ సత్యవతి, అకాడమిక్ కన్సల్టెంట్లు, పరిశోధకులు, విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

స్మగ్లర్‌ వీరప్పన్‌తో నాసాహసయాత్ర – ఎస్‌.నగేష్‌, ఓఎస్‌డి , టీటీడీ.

Tags: Nehru National Literacy Awards for SUV Professors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page