కోకో కోలా కంపెనీ ఎన్నికల్లో గెలిచిన మురళి ని ఘనం గా సన్మానించిన రాజా రెడ్డి     

0 9,270

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీకాళ హస్తి మండలం కాపుగున్నేరి వద్ద గల కోకో కోలా మంగళ వారం జరిగిన గుర్తింపు ఎన్నికల్లో వై ఎస్ ఆర్ టీ యూ సీ కి చెందిన టీ-22 యూనియన్ తరపున గెలిచిన వాకా మురళి ని బుధ వారం ఉదయం వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర అధ్య క్షులు డా. పూనూరు గౌతమ్ రెడ్డి అదేశాల మేరకు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రాజా రెడ్డి కోకో కోలా కంపెనీ ప్రధాన ద్వారం వద్ద శాలువ కప్పి ఘనం గా సన్మానించారు. ఈ సందర్బంగా ఎన్. రాజా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి జరిగిన ప్రతి ఎన్నికల్లో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనం గా విజయం సాధిస్తున్నదని అన్నారు. కోకో కోలా కంపెనీలో గత నాలుగు పర్యా యాలుగా వై ఎస్ ఆర్ టీ యూ సీ సంఘం గెలుస్తూనే ఉన్నదని, దానికి అన్ని విదాలా సహకరిస్తున్న శ్రీకాళ హస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన రెడ్డి, యూనియన్ గౌరవ అధ్య క్షురాలు బియ్యపు పవిత్రారెడ్డి లకు మరియు ఓ ట్లు వేసి అథ్యదిక మెజారిటీతో గెలిపించిన కార్మికులకు వై ఎస్ ఆర్ టీ యూ సీ రాష్ట్ర కమిటి తరపున ధన్యవాదాలు తెలిపారు. గెలిచిన వారు కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి క్రుసి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోకో కోలా ఉద్యోగుల యూనియన్ అధ్య క్ష్య, ప్రధాన కార్య దర్శులు మోహన్ గౌడ్, మురళి, ఉపాధ్య క్షులు సూరీబాబు, కోసాదికరి సుబ్బారా యుడు, పురుషోట్టం, సరత్, చందు, మురళి మోహన్, మధు రెడ్డి, పణి కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

స్మగ్లర్‌ వీరప్పన్‌తో నాసాహసయాత్ర – ఎస్‌.నగేష్‌, ఓఎస్‌డి , టీటీడీ.

Tags; Raja Reddy honors Murali, who won the Coca-Cola Company election

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page