సంక్రాంతి కోడి పందేలకు అంతారెడీ

0 8,585

ఏలూరు ముచ్చట్లు:

 

చిన్నా పెద్దా అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అంటే. మరికొద్ది రోజుల్లో ఈ పండుగా రానుంది. ప్రతి ఇంటా సంబరాలు తీసుకువచ్చే సంక్రాంతి పండుగ కోసం ప్రతీ ఒక్కరో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది కోడి పందేలు. మరో 20 రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. ఈ క్రమంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతాయి. ఈ కోడి పందేలలో కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. ఇక్కడ జరిగే కోడిపందాలు చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం వస్తుంటారు. పార్టీలకతీతంగా, కుల, మత బేధాలు కతీతంతంగా ఒక్క కోడిపందేలలోనే అందరూ కలిసి పాల్గొంటారు.అయితే ఉభయ గోదావరి జిల్లాలోని ప్రతి పల్లెలో పండగ సందర్భంగా కోడి పుంజులను ఎంతో శ్రద్ధగా పెంచుతారు. కోడి పందేల్లో నెగ్గాలంటే.. ఆ కోడి పుంజులు బలిష్టంగా ఉండాలి. అందుకని, వాటికి బలవర్ధకమైన ఆహారం మేతగా పెడతారు. నాన్ వెజ్ మొదలు, డ్రైఫ్రూట్స్, మద్యం కూడా తాపుతారు. అయితే, ఈ రేంజ్‌లో పెంచే పుంజులపై కేటుగాళ్ల కన్ను పడింది. ఒక్కొక్క పుంజు ఖరీదు 10వేల నుంచి 50 వేల వరకు ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో పల్లెలలో కోడిపుంజుల దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ యడవల్లిలో కోడిపుంజులను దొంగతనం చేస్తూ ఓ వ్యక్తి గ్రామస్తులకు పట్టుబడ్డాడు. నలుగురు వ్యక్తులు రెండు బైక్లపై వచ్చి గ్రామంలో అనుమానాస్పదంగా తిరగడం ప్రారంభించారు. అయితే ఓ ఇంటి వద్ద ఎవరూ లేకపోవడాన్ని గమనించిన కేటుగాళ్ళు కర్రకు కట్టేసిన ఓ కోడిపుంజు తాడు విపి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అప్రమత్తమైన మిగతా ముగ్గురు కేటుగాళ్ళు అక్కడి నుంచి బైక్‌లపై పరారయ్యారు. అయితే, పట్టుబడిన వ్యక్తిని గ్రామస్తులు చెట్టుకు కట్టివేసి దేహ శుద్ధి చేశారు. ఎక్కడి నుంచి వచ్చారంటూ ఆరా తీశారు. పొంతనలేని సమాధానం చెబుతూ గ్రామస్తులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించి.. వారికి అప్పగించారు.

- Advertisement -

స్మగ్లర్‌ వీరప్పన్‌తో నాసాహసయాత్ర – ఎస్‌.నగేష్‌, ఓఎస్‌డి , టీటీడీ.

Tags: Wallpapers Antaredi for chicken races

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page