Natyam ad

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాల‌కు సాంస్కృతిక‌ శోభ

తిరుమల ముచ్చట్లు:

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో శ‌నివారం తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ఏర్పాటు చేసిన ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు శ్రీవారి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఇందులో భాగంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య‌ కళాశాలకు చెందిన శ్రీ బి.కేశ‌న్న‌ బృందం మంగళధ్వని కార్య‌క్ర‌మం జరిగింది. తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ‌మ‌తి జ‌ల‌జాక్షి బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు గ‌ద్వాల్‌కు చెందిన మోహ‌న్ సంప్ర‌తి బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.సాయంత్రం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుడు బి.ర‌ఘునాథ్ అన్న‌మ‌య్య విన్న‌పాలు సంగీత కార్య‌క్ర‌మం, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు  కె.చంద్ర‌శేఖ‌ర్ బృందం హరికథ కార్యక్రమం జరుగుతుంది.

Post Midle

Tags: 2022 Srivari Salakatla Brahmotsavam Cultural splendor of Srivari Brahmotsavam

Post Midle

Leave A Reply

Your email address will not be published.